AP Grama Sachivalayam Attendance Rules 2024: జీతాల పై కీలక ఆదేశాలు

Join Our Telegram
Join Now
Join Our WhatsApp
Join Now

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు – జీతాల కొత్త మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం
Attendance Rules: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన హాజరు, జీతాల వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ మార్పులతో ఉద్యోగుల సమయపాలనపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబడుతాయని స్పష్టం చేసింది.


హాజరుతో జీతాల అనుసంధానం

ఇకపై సచివాలయ ఉద్యోగుల జీతాలు బయోమెట్రిక్ హాజరుకు అనుసంధానమయ్యాయి. గ్రామా, వార్డు సచివాలయశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతి ఉద్యోగి జీఎస్‌డబ్ల్యుఎస్‌ అటెండెన్స్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయడం తప్పనిసరి. ఉదయం 10:30 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత హాజరు నమోదు చేసినట్లయితేనే ఆ రోజు జీతం పొందగలరని స్పష్టం చేశారు.


ముఖ్యాంశాలు

  1. ఉద్యోగులు ఉదయం 10:30 లోపు హాజరు నమోదు చేయాలి.
  2. సాయంత్రం 5 తర్వాత హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది.
  3. రోజుకు రెండు సార్లు హాజరు ఉంటేనే వేతనం చెల్లించబడుతుంది.
  4. ఒకసారి మాత్రమే హాజరు ఉంటే ఆ రోజు క్యాజువల్ లీవ్‌గా పరిగణించబడుతుంది.
  5. పాత పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఏఎన్ఎంలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది.

ఉద్యోగుల హాజరుపై పర్యవేక్షణ

గ్రామ, వార్డు సచివాలయశాఖ తాజాగా కలెక్టర్లకు పర్యవేక్షణ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఉద్యోగి హాజరును జీఎస్‌డబ్ల్యుఎస్‌ యాప్‌ వెర్షన్‌ 2.2 ద్వారా క్రమంగా నమోదు చేయాలని సూచించింది.


ఉద్యోగుల అభ్యంతరాలు

ఉద్యోగుల సంఘాలు ఈ మార్పులపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. హాజరుకు సంబంధించిన కొత్త నిబంధనలు ఉద్యోగులపై అదనపు ఒత్తిడిగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.


Attendance Rules Overview

విషయం వివరణ
హాజరు విధానం ఉదయం 10:30 లోపు, సాయంత్రం 5 తర్వాత హాజరు తప్పనిసరి
జీతాల లింక్‌ బయోమెట్రిక్ హాజరు ఆధారంగా మాత్రమే జీతం
మినహాయింపు పాత పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఏఎన్‌ఎం గ్రేడ్-1
కలెక్టర్ల పర్యవేక్షణ ప్రతి ఉద్యోగి హాజరును పర్యవేక్షించి నివేదిక ఇవ్వాలి
యాప్‌ వెర్షన్‌ జీఎస్‌డబ్ల్యుఎస్‌ వెర్షన్‌ 2.2

 

AP Grama Sachivalayam Attendance Rules 2024 AP Grama Sachivalayam official website – Click Here


AP Grama Sachivalayam Attendance Rules 2024 APSRTC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ RTC లో 7,545 భారీగా ఉద్యోగాలు

AP Grama Sachivalayam Attendance Rules 2024 Ap Pension Cancellation 2024: ఏపీలో వాళ్లందరి పింఛన్‌లు రద్దు.. నోటీసులు కూడా జారీ

Join Our Telegram
Join Now
Join Our WhatsApp
Join Now

 

Income Tax Jobs: 10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ లో 2036 ఉద్యోగాలు

Ap Ration Dealer Jobs 2024: AP పౌర సరఫరాల శాఖ లో ఉద్యోగాలు

 

Leave a Comment

WhatsApp