50% రాయితీపై మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లు – అప్లికేషన్ విధానం & పూర్తి వివరాలు | Mahila Rythu Subsidy Agriculture Tools
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం 2025
🔹వ్యవసాయ యాంత్రీకరణలో మహిళలకు ప్రోత్సాహం
తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో మహిళా రైతుల కోసం ఎస్ ఎమ్ ఎ ఎమ్ (SMAM) పథకం ద్వారా 50% సబ్సిడీ పై వ్యవసాయ పనిముట్లు అందించనున్నారు. ఈ పథకం కింద 459 యూనిట్లు మంజూరు చేయబోతున్నారు.
🟢 పథకం కింద లభించే వ్యవసాయ పనిముట్లు
మొత్తం బడ్జెట్: ₹1.69 కోట్లు
పరికరం పేరు | యూనిట్లు |
---|---|
బ్యాటరీ స్ప్రేయర్లు | 125 |
తైవాన్ స్ప్రేయర్లు | 126 |
డ్రోన్ | 1 |
రోటో వీటర్లు | 70 |
విత్తనము ఎరువులు వేసే యంత్రాలు | 15 |
కల్టివేటర్, ఎంబీ ప్లవ్, కేజీవీల్ | 88 |
బండ్ ఫార్మర్ | 5 |
పవర్ వీడర్లు | 5 |
బుష్ కటర్లు | 6 |
పవర్ టిట్లర్లు | 4 |
ట్రాక్టర్లు | 3 |
మెజ్ షెల్లర్లు | 2 |
వరి గడ్డి కట్టలు కట్టే యంత్రాలు | 3 |
📝 సబ్సిడీ కోసం అర్హతలు
✅ మహిళా రైతుల పేరు మీద భూమి నమోదు అయి ఉండాలి.
✅ భూమి పాస్‌బుక్ తప్పనిసరి.
✅ ఆధార్ కార్డు సమర్పించాలి.
✅ ట్రాక్టర్ సంబంధిత పనిముట్లకు ట్రాక్టర్ ఆర్ సీ అవసరం.
✅ దరఖాస్తు చేసుకునే వారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
📌 ఎలా అప్లై చేయాలి?
👉 ఆసక్తి గల మహిళా రైతులు మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
👉 పథకం గురించి మరిన్ని వివరాల కోసం సిద్ధిపేట జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించండి.
🌾 ఈ అవకాశం మహిళా రైతుల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. అర్హత కలిగిన రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి!
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి