ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం నేరుగా రూ.33 వేలు: పశుగ్రాసాల సాగు పథకానికి దరఖాస్తు చేయండి
AP Govt 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్నల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో బహు వార్షిక పశుగ్రాసాల సాగు పథకం ఎంతో కీలకంగా మారింది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం రైతుల అకౌంట్లలో నేరుగా రూ.33,000 వరకు జమ చేయనుంది.
AP Govt 2024 పథకం వివరాలు:
బహు వార్షిక పశుగ్రాసాల సాగు పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించటంతో పాటు పశువుల ఆహారం కోసం అవసరమైన వనరులను ఉచితంగా అందిస్తారు. ఈ పథకం ఎస్సీ, ఎస్టీ రైతులు, చిన్న మరియు సన్నకారు రైతులు లకు ప్రత్యేకంగా రూపొందించబడింది.
సహాయం పొందడానికి అర్హతలు:
- భూమి పరిమితి: కనీసం 5 ఎకరాలు భూమి ఉండాలి.
- జాబ్ కార్డు: ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు కలిగి ఉండాలి.
- నీటి వసతి: సాగు చేయవలసిన భూమిలో నీటి వసతి తప్పనిసరి.
అన్నదాత సుఖీభవ పథకం ఏపీ రైతులకు రూ.20,000 ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి
ప్రభుత్వ ఆర్థిక సహాయం:
ప్రభుత్వం కూలీల వేతనాలు మరియు మెటీరియల్ ఖర్చులను భరించి ఆర్థిక సహాయం అందిస్తోంది.
భూమి పరిమాణం | కూలీల ఖర్చు | మెటీరియల్ ఖర్చు | మొత్తం |
---|---|---|---|
10 సెంట్లు | రూ.3,000 | రూ.3,599 | రూ.6,599 |
20 సెంట్లు | రూ.6,000 | రూ.7,197 | రూ.13,197 |
30 సెంట్లు | రూ.9,000 | రూ.10,795 | రూ.19,795 |
40 సెంట్లు | రూ.12,000 | రూ.14,394 | రూ.26,394 |
50 సెంట్లు | రూ.15,000 | రూ.17,992 | రూ.32,992 |
అప్లై చేయడానికి అవసరమైన పత్రాలు:
- అప్లికేషన్ ఫారం
- జాబ్ కార్డు జిరాక్స్
- పొలం 1B జిరాక్స్
- ఆధార్ కార్డు జిరాక్స్
- బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్
దరఖాస్తు ప్రక్రియ:
- మీకు దగ్గరలోని పశు వైద్య అధికారి వద్ద ఈ పత్రాలను అందజేయండి.
- సాగు చేయవలసిన భూమిలో నీటి వసతి ఉందని నిర్ధారించుకోండి.
రైతులకు మరో శుభవార్త.. నేరుగా అకౌంట్లోకి రూ.75 వేలు
ఫలితంగా లభించే ప్రయోజనాలు:
- పశువుల ఆహారం కోసం పచ్చిక బొట్టల పెంపకం.
- రైతుల ఆదాయం పెంపు.
- ప్రత్యామ్నాయ పంటల ద్వారా అదనపు ఆదాయం.
KADIYALA HEMA SUNDAR
Hi
Good decision