ఆంధ్రప్రదేశ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే 2025 | AP Work From Home Survey 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) కల్చర్‌ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతకు మరియు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Ap Work From Home Survey ముఖ్యాంశాలు:
- ప్రముఖ లక్ష్యం: రాష్ట్రవ్యాప్తంగా 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారిని గుర్తించడం.
- సర్వే నిర్వహణ: గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటా వెళ్లి వివరాలు సేకరిస్తారు.
- సేకరించే సమాచారం:
- విద్యార్హతలు మరియు టెక్నికల్ స్కిల్స్
- ప్రస్తుత ఉపాధి స్థితి
- వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలపై ఆసక్తి
- ఇంటర్నెట్ మరియు బ్రాండ్‌బ్యాండ్ అందుబాటులో ఉందా?
Ap Work From Home Survey ప్రభుత్వ ప్రణాళికలు:
- వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతోంది.
- సర్వే అనంతరం, ఎంపికైన వారికి అవసరమైన శిక్షణ మరియు వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనుంది.
- ఒకే ప్రాంతంలో 20-25 మంది కలసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రత్యేక అవకాశాలు:
- సర్వే డేటా ఆధారంగా టెక్ కంపెనీలు, BPO, KPO, డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు.
- ఇంటర్నెట్ స్పీడ్ మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది.
- మార్చి 10 వరకు సర్వే పూర్తయిన తర్వాత, సేకరించిన డేటాను ప్రభుత్వం విశ్లేషించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది.
మొత్తం మీద, ఈ సర్వే ద్వారా వేలాదిమంది నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉపాధి అవకాశాలు లభించే అవకాశముంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ గ్రామ/వార్డు సచివాలయాలను సంప్రదించి వివరాలు అందించాలి.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి